NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌స్ట్ 3 నెల‌ల్లో బీఆర్ఎస్ సీన్ ఇంత రివ‌ర్స్ అయ్యిందా… దిక్కులేక ఏం చేస్తోందంటే…!

జ‌స్ట్ మూడే మూడు నెల‌ల్లో తెలంగాణ‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ సీన్ పూర్తిగా రివ‌ర్స్ అయిపోయింది. తెలంగాణ కొట్లాడి తెచ్చామ‌న్న పార్టీ.. పైగా ప‌దేళ్ల పాటు కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. సంస్థాగ‌తంగా పార్టీ చాలా బ‌లంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడి అధికారానికి దూర‌మైంది. ఇదంతా జ‌రిగి మూడు నెల‌లు కూడా కాలేదు. అంతే బీఆర్ఎస్ ప‌రిస్థితి రాష్ట్రంలో దిక్కూ లేనిదిగా మారిపోయింది.ప‌దేళ్లు ఏక‌చ‌క్రాధిప‌త్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ అంటే ఎంత బ‌లంగా ఉండాలి.. ఆ పార్టీ నుంచి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు లీడ‌ర్లు క్యూలో ఉండాలి.

మ‌రో నెల రోజుల్లో పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతుంటుంటే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేని దుస్థితి. ప్రజాస్వామ్యం అంటే… ఇదే. ఎవరైనా ప్రజలు అధికారం ఇచ్చినంత వరకే కింగ్‌లుగా ఉంటారు. అధికారం లేనివాడు బొంగే. అధికారంలో ఉన్న‌ప్పుడు విర్ర‌వీగి ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల చేత తిర‌స్క‌ర‌ణ‌కు గురైన పార్టీలు చ‌రిత్ర‌లో చాలానే చూశాం. ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి కూడా అంతే..!

2010 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ఎంత డిమాండ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అస‌లు ఒకానొక టైంలో బీఆర్ఎస్ లో టిక్కెట్లు దొర‌క్క బండి ఓవ‌ర్ లోడ్ అయిపోయింది. గ‌త ఐదారు నెలల క్రితం వ‌ర‌కు కూడా ఇదే ప‌రిస్థితి. కేసీఆర్ ఎవ‌రికి సీటు ఇచ్చినా కూడా తెలంగాణ జ‌నాలు అస్స‌లు ప‌ట్టించుకునే వారే కాదు. కేవ‌లం కారు గుర్తుకు ఓటేసి వారిని భారీ మెజార్టీల‌తో గెలిపించే వారు.

అస‌లు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన మెజార్టీలు చూసి పలు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు దిమ్మ‌తిరిగిపోయింది. ఇలాంటి గొప్ప ఘ‌న‌విజ‌యాన్ని ఎవ్వ‌రూ ఊహించ‌నే లేదు. ఇక ఇప్పుడు ఎంపీ ఎన్నిక‌లు జ‌రుగుతుంటే ఆ పార్టీకి క్యాండెట్లు దొర‌క‌డం లేదు. అస‌లు సిట్టింగ్ ఎంపీలే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. జహీరాబాద్ లో బీబీ పాటిల్ అనే ఎంపీకి తెలుగు కూడా రాదు. అయినా ఆయ‌న రెండుసార్లు ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయ‌న పార్టీ వ‌దిలేసి బీజేపీలోకి వెళ్లి.. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.

మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడో సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడి కుమారుడు కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయ‌న అసలు నోరు తెరిచి ఏనాడు ప్ర‌సంగం కూడా చేయ‌లేదంటారు. చివ‌ర‌కు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రెండు, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేసి చేతులు దులిపేసుకునే ప్ర‌య‌త్నం కూడా జ‌రుగుతోంది. నాగ‌ర్‌క‌ర్నూల్, పెద్ద‌ప‌ల్లి ఎంపీలు కూడా పార్టీ మారిపోయారు. ఏదేమైనా జ‌స్ట్ మూడే మూడు నెల‌ల్లో కేసీఆర్ జాత‌కం ఈ స్థాయిలో రివ‌ర్స్ అవుతుంద‌ని ఊహించ‌నే లేదు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?