NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ పొత్తు ప‌డిచింది… ఎవ‌రికి ఎన్ని సీట్లు అంటే…!

ఏపీలో పొత్తుల అంశంపై గ‌త నెల రోజులుగా నానుతూ వ‌స్తోన్న పొత్తు ఎట్ట‌కేల‌కు పొడిచింది. దీనిపై అధికారిక ప్రకటన శనివారం వెనలువడనుంది. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఢిల్లీలో మకాం వేసి ఎట్ట‌కేలకు పొత్తు పోడిచేలా చేశారు. ఇక పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తుంది ? ఎవ‌రు ఎక్క‌డ పోటీ చేయాల‌న్న‌దాని మీదే క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు 24 అసెంబ్లీ, 3 పార్ల‌మెంటు స్థానాలు జ‌న‌సేన‌కు ఇచ్చారు. ఇక బీజేపీ కూడా పొత్తులోకి రావ‌డంతో మొత్తంగా రెండు పార్టీల‌కు క‌లిపి 30 అసెంబ్లీతో పాటు 8 పార్ల‌మెంటు సీట్లు ఇస్తామ‌ని చెప్పారు.

ఇక ఢిల్లీలో భేటీలో అమిత్ షా కాస్త ఎక్కువ‌గానే ఎంపీ సీట్లు అడిగార‌ని స‌మాచారం. ఎంపీ సీట్లు ఎక్కువ కావాలని బీజేపీ హైకమాండ్ ప‌ట్టుబ‌ట్ట‌డంతో జ‌న‌సేన త్యాగాల‌కు సిద్ధం కాక త‌ప్ప‌ట్లేద‌ని తెలుస్తోంది. జనసేనకు మూడే పార్లమెంట్ సీట్లు ఇచ్చినా బీజేపీకి ఐదు సీట్ల వరకూ కేటాయిచాలని నిర్ణయించారు. ఇక బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లను ఫైనల్ చేశారు. ఏయే సీట్లు అన్నదానిపైనా స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక బీజేపీ ఆరో పార్ల‌మెంటు సీటు కూడా కావాల‌ని ప‌ట్టుబ‌డితే అప్పుడు జ‌న‌సేన మ‌రో పార్ల‌మెంటు సీటు కూడా వ‌దులుకునేందుకు సిద్ధంగా ఉందంటున్నారు.

వాస్త‌వానికి శ‌నివారం ఉద‌య‌మే మూడు పార్టీల నేత‌లు పొత్తుల గురించి ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలో పొత్తులు, పార్టీలతో చర్చల కారణంగా అధికారిక ప్రకటన ఆలస్యమైంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన‌తో పొత్తు నేప‌థ్యంలో టీడీపీ కేడ‌ర్ మానసికంగా సిద్ధ‌మైంది. ఇప్పుడు ఈ కూట‌మిలోకి బీజేపీ కూడా ఎంట‌ర్ కావ‌డంతో టీడీపీ వాళ్ల‌తో పాటు జ‌న‌సేన కూడా మ‌రికొన్ని త్యాగాలు చేస్తూ మ‌రికొన్ని సీట్లు కూడా వ‌దులుకోవాల్సి ఉంటుంది.

జ‌న‌సేన‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 7 శాతం ఓట్లు వ‌చ్చాయి. అయితే విచిత్రంగా 1 శాతం ఓట్లు కూడా లేని బీజేపీకి ఏకంగా 5 – 6 పార్ల‌మెంటు సీట్లు ఇవ్వడం అంటే చాలా ఎక్కువే. అయితే బీజేపీతో పొత్తు ఉంటేనే ఏపీలో ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయ‌న్న న‌మ్మ‌కం జ‌న‌సేన‌, టీడీపీకి ఉంది. దీంతో పాటు రేపు ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి వ‌చ్చినా కూడా ప్రభుత్వం నడవాలంటే… కేంద్రం సహకారం తప్పనిసరి. దీంతో పాటు కేంద్ర ప్రాజెక్టులతో పాటు… ఈ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులతో ముందు ముందు…. వడ్డీలు చెల్లించడానికి ఆదాయం కూడా సరిపోదు.

అప్పుడు అయినా కేంద్రం స‌హ‌కారం ఉండాల్సిందే. దీంతో పాటు వైసీపీ ఎదురు దాడులు త‌ట్టుకోవ‌డంతో పాటు రాజకీయంగా కూడా వైసీపీని పాతాళంలోకి తొక్కడానికి బీజేపీ సహకారం ఉండాల‌ని ప‌వ‌న్‌, డిసైడ్ అయ్యారు. అందుకే ప‌వ‌న్‌, చంద్ర‌బాబు కాస్త త‌గ్గి అయినా బీజేపీతో క‌లిసే ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

Related posts

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju