Thaman : టాలీవుడ్ లో హీరో హీరోకు హీరోయిన్స్ మధ్య, మ్యూజిక్ డైరెక్టర్ ..డైరెక్టర్స్ మధ్య ఎప్పుడు గట్టి పోటీ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక డైరెక్టర్ కామెడి జోనర్ లో సినిమా తీసి హిట్ కొడితే మరో డైరెక్టర్ కూడా అదే జోనర్ లో సినిమా తీసి హిట్ కొట్టాలని ట్రై చేస్తాడు. అదే యాక్షన్ జోనర్ అయితే మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఇలా సినిమాల జోనర్స్ ఎప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అందుకే ఒక జోనర్ లో సూపర్ హిట్ అయితే అదే జోనర్ లో ఓ నాలుగైదేళ్ళు సినిమాలు వస్తుంటాయి.
హీరోలు కూడా అదే జోనర్ లో కథ రాయమని స్వయంగా దర్శక, రచయితలకు సలహాలిస్తుంటారు. ఈ క్రమంలోనే సినిమాకి మ్యూజిక్ పరంగా ఓ ట్రెండ్ సెట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి వరుసగా హీరోలు దర్శకులు అవకాశాలిస్తుంటారు. ఇంతక ముందు టాలీవుడ్ లో మణిశర్మ హవా బాగా నడిచింది. చిరంజీవి నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు మణిశర్మ మ్యూజిక్ అందించిన సినిమాలే ఉండేవి. ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చారు. ఒక ఊపు ఊపుతున్నారు. థమన్, దేవీశ్రీ ప్రసాద్ ముందు వరుసలో ఉన్నారని చెప్పాలి.
Thaman : థమన్ ఇప్పుడు కొనసాగిస్తున్న దూకుడుకి దేవీశ్రీప్రసాద్ బ్రేక్
అయితే ఇప్పుడు దేవీశ్రీ కంటే ఎస్ ఎస్ థమన్ ఊపు బాగా కనిపిస్తోంది. ఆయన సంగీతం ఇస్తున్న సినిమా పెద్ద సక్సెస్ అవుతున్నాయి. సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ సృష్ఠిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ రాక్ స్టార్ ఫాంలోకి వస్తున్నాడు. వరుసగా థమన్ సినిమాలు చేస్తుండగా ఆ అవకాశాలు మళ్ళీ దేవీశ్రీ దక్కించుకుంటున్నాడు. థమన్ ఇప్పుడు కొనసాగిస్తున్న దూకుడుకి దేవీశ్రీప్రసాద్ బ్రేక్ వేయడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినబడుతోంది. చూడాలి మరి ఇద్దరిలో ఎవరు మళ్ళీ టాప్ ప్లేస్ లో నిలబడతారో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!