న్యూస్ సినిమా

కాబోయే భర్త ఆ టైపు వాడైతే బెటర్ అంటున్న సదా.. షాక్ అయిన ఫ్యాన్స్‌!

Share

హీరోయిన్ సదా పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒకే ఒక డైలాగ్ ‘వెళ్లవయ్యా వెళ్లు’. జయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సదా, తన మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో సదా చెప్పే వెళ్లవయ్య వెళ్ళు డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ సిగ్నేచర్ డైలాగ్ చాలామంది ఫాలో అవుతారు. ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది. కానీ జయం సినిమాకు వచ్చినంత గుర్తింపు మరే సినిమాకి రాలేదు. క్రమంగా అవకాశాలు తగ్గడంతో కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెర డ్యాన్స్ షోలోకి జడ్జిగా వ్యవహరిస్తుంది. తాజాగా ‘హోల్డ్ వరల్డ్’ అనే సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చింది.

పెళ్లిపై సదా కామెంట్స్

ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి, ప్రేమ విషయాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. నిజానికి సదా 30 ఏళ్లు వయసు వచ్చినా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ సమయంలో కాబోయే భర్త గురించి ఆమె చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆమె పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. “నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను పెళ్లి చేసుకోండి అంటూ ఉచిత ఆఫర్స్ ఇచ్చారు. మన జీవితం మీద కామెంట్ చేసివారికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 10 జంటలు పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలు అయినా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నాయా? ఎవరు హ్యాపీగా ఉండటం లేదు ” అంటూ చెప్పుకొచ్చింది.

అలాంటి అబ్బాయి అయితే పెళ్లికి ఓకే

సదా తన కాబోయే భర్త గురించి చెప్తూ “నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. పార్టీలకు, పబ్బులకు నేను వెళ్లను. ఆల్కహాల్ తాగను, నైట్ అవుట్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేరు. ఎవరో నన్ను సంతోషంగా ఉంచాలని ఎందుకు అనుకోవాలి. నీ సంతోషం కోసం నువ్వు వేరే వాళ్లపై ఆధారపడాల్సిన అవసరం ఏముంది?నాకు కాబోయే భర్త వెజిటేరియన్ అయ్యి ఉండాలి. అతడు ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. ముఖ్యంగా నా సంపాదనపై అతను ఆధారపడొద్దు. అలాంటివాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటా” అంటూ తనకు ఎలాంటి అబ్బాయి కావాలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వెజిటేరియన్ అబ్బాయి కావాలి అనేసరికి నాన్-వెజ్‌ అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు.


Share

Related posts

BJP: ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక.. మోడీ చాలా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు..?

somaraju sharma

Beast: `బీస్ట్ ` 3 డేస్‌ క‌లెక్ష‌న్‌.. నెగ‌టివ్ టాక్ ఉన్నా విజ‌య్ అద‌ర‌గొడుతున్నాడుగా!

kavya N

సింగపూర్ ఉప ప్రధానికి  లోకేష్ ఏమి చెప్పాడో

somaraju sharma