‘సీఎస్ బదిలీపై పిల్!’

అమరావతి: కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు, రాష్ట్రంలోని డిజిపిలకు ఇప్పటికే కనీసన కాలపరిమితి విధానాలు, ఎంపిక విధానాలు ఉన్నాయని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని ప్రధాన కార్యదర్శి పదవికి వర్తింపజేయాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ అంశంలో ఇప్పటికే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేటట్లు చూడాలని అభ్యర్థించినట్లు ఐవైఆర్ తెలిపారు

ప్రధాన కార్యదర్శిని, మిగిలిన అధికారులను విచక్షణ రహితంగా బదిలీ చేయకూడదనీ, కనీసం రెండు సంవత్సరాలు పదవిలో పని చేసే అవకాశం కల్పించాలని ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్ సంస్థ తరపున హైకోర్టులో తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినట్లు ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు.

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను అర్ధాంతరంగా బదిలీ చేయడాన్ని ఐవైఆర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐవైఆర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.