NewsOrbit
Featured న్యూస్

‘ఆపరేషన్ గుణపాఠం’ మొదలెట్టిన జగన్! ఇది అల్లాటప్పా ప్రాజెక్టు కాదు !!

ఎప్పటికప్పుడు తాను నిప్పు అని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెట్టాలని ప్రస్తుత ముఖ్యమంత్రి ,వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.

Jagan who started 'Operation Gunapatham' This is not an dummy project
Jagan who started ‘Operation Gunapatham’ This is not an dummy project

మాట్లాడితే తనను ఉద్దేశించి ఏ వన్ అని ,జైలు పక్షి అని రకరకాలుగా ఎద్దేవా చేస్తున్న చంద్రబాబునాయుడు ఆయన బ్యాచ్కి తగిన గుణపాఠం నేర్పడం కోసం జగన్ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు.నిజానికి చంద్రబాబు తప్పుచేసినా ఎవరికీ దొరకని రీతిలో చేస్తారు. ఒకవేళ దొరికిపోయే పరిస్థితి వస్తే తాను నిప్పు అని బుకాయిస్తారు.ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబునాయుడికి మించిన నేర్పరి మరొకరుండరు.అనేక కోర్టు అనేక కోర్టు కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ అన్నింట్లో స్టే తెచ్చుకుని ఏ కోర్టు కేసు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటూ ప్రజల దృష్టిలో తానో పత్తితు అనిపించుకుంటున్నారు.

దీనిని గమనించిన జగన్ చంద్రబాబు తరహాలోనే కౌంటర్ సిద్ధం చేశారు.చంద్రబాబు తప్పుకు ఇట్టే దొరకరు అన్న పాయింట్ ని ఆధారం చేసుకునే జగన్ చంద్రబాబు మీద తనదైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబుని జనం ముందు దోషి గా నిలబెట్టి మీరే తేల్చుకోండి అంటున్నారు. బాబు అయిదేళ్ల పాలన మీద తీర్పు చెప్పిన ప్రజలకు అమరావతి రాజధాని భూముల కధను కూడా విప్పి చెప్పి మరీ జగన్ న్యాయం చెప్పమంటున్నారు.అమరావతి రాజధాని కోసం వందల రోజుల పాటు ఆందోళన అక్కడ రైతులు చేశారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. అయితే అమరావతి రాజధాని విషయంలో అక్కడ జనాలు తప్ప మిగిలిన వారు ఎవరూ గట్టిగా స్పందించలేదు..మద్దతు కూడా ఇవ్వలేదు దీన్నే జగన్ ప్రజల ముందు పెట్టారు.అలాగే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమరావతి ప్రాంతంలో భూ దందా ఎలా జరిగిందో కూడా ఆయన ప్రజలకు వివరించే రీతిలో ప్రచారం చేపట్టారు .

అంతే కాదు… అమరావతి కుంభకోణం మీద ఇంకా చెప్పాల్సింది చాలానే ఉందంటూ సీరియల్ కధగా ఈ వ్యవహారాలను జగన్ నడుపుతూనే ఉంటారు. ఇది ఇలా సాగినంతకాలం చంద్రబాబు బదనాం అవుతుంటారు. అమరావతి విషయంలో ఎవరేమి భూములు కొన్నారో ఎంతెంత కొన్నారో వివరాలు ఇప్పటికే పలుమార్లు మీడియాలో వచ్చేశాయి. దాని మీద అగ్గి రాజుకుంటూనే ఉంది. వైసీపీ సర్కార్ కూడా దాన్ని వదిలిపెట్టేది లేదు. మొత్తం మీద చంద్రబాబును తలెత్తుకోని రీతిలో దెబ్బకొట్టడానికి జగన్ సరైన పంధానే ఎంచుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju