సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా లైవ్ లో ఉన్నట్లుండి ఒక్కసారిగా సీరియస్ అయిపోయారు. మేటర్ లోకి వెళ్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అదే విధంగా ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే ప్రభాస్ పెళ్లి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉంటాయి.
ఇదిలా ఉంటే ఈ రోజు 80వ పుట్టిన రోజు సందర్భంగా సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమా కృష్ణం రాజు బ్యానర్లో తెరకెక్కుతున్న నేపథ్యంలో అనేక మంది సినిమా గురించి ప్రశ్నలు వేశారు.
మరికొంతమంది ఆడియన్స్ ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు వేయటంతో కృష్ణంరాజు కాస్త సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ప్రశ్న ఎదురైనప్పుడు వెంటనే కృష్ణంరాజు తడుము కోకుండా అయినప్పుడు అంటూ సమాధానం చెప్పేశారు. ఈ తరుణంలో యాంకర్ పట్టుబట్టగా.. ప్రభాస్ పెళ్లి అనేది ఎప్పుడు అంటే తాను చెప్పలేనని, అవనీయండి అయినప్పుడే చూద్దామని కాస్త సీరియస్ సమాధానమిచ్చారు.