NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వ‌ర్క్ ఫ్రం హోం షాకింగ్ న్యూస్ …. ఆ మూడు కంపెనీల్లో

job hiring increasing in india

వ‌ర్క్ ఫ్రం హోం… క‌రోనా స‌మ‌యంలో ఈ త‌ర‌హా ప‌ని విధానం తీరు మారిపోయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటివద్ద నుంచే పని చేసే సౌకర్యాన్ని కల్పించాయి. అయితే కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గడంతోపాటు, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండడంతో ఈ విధానంపై కొత్త చ‌ర్చ మొద‌లైంది. మూడు కంపెనీలు కీల‌క ప్ర‌క‌ట‌న చేశాయి.

job hiring increasing in india

మూడు కంపెనీలు…

వ‌ర్క్ ఫ్రం హోంతో ఐటీ రంగంలోని కంపెనీలకు చెందిన 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండడంతో తిరిగి ఎంప్లాయిస్ ను ఆఫీసులకు రప్పించే పనిలో ఐటీ కంపెనీలు పడ్డాయి. దేశీయ ఐటీ దిగ్గ‌జ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలకు చెందిన 98 శాతం వరకు ఉద్యోగులు మార్చి 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయనున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలకు చెందిన 98 శాతం వరకు ఉద్యోగులు మార్చి 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోం చేయనున్నారు. . టీసీఎస్ ఉద్యోగుల్లో 97 శాతం మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. వచ్చే ఐదేళ్ల‌లో 25 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయిస్తామని టీసీఎస్ గతంలో ప్రకటించింది.

 

ఇన్ఫోసిస్ కీల‌క ప్ర‌క‌ట‌న

ప్రస్తుతం భారత్‌లో 99 శాతం మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేస్తున్నారని, జనవరి-మార్చి క్వార్టర్ వరకు పరిస్థితులు మారకపోవచ్చునని ఇన్ఫోసిస్ హెడ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అన్నారు. 2021 ఏప్రిల్ తర్వాత అప్పటి కరోనా పరిస్థితులను బట్టి వర్క్ ఫ్రమ్ హోం లేదా కార్యాలయాలకు రప్పించనున్నట్లు తెలిపారు. తమకు ఉద్యోగుల భద్రత ముఖ్యమన్నారు. కేవలం అవసరమైన ఉద్యోగులు మాత్రమే ట్రావెల్ చేస్తున్నారని, అలా ట్రావెల్ చేస్తున్నవారు కొంతమంది మాత్రమేనని చెప్పారు. అలాగే, 98 శాతం విప్రో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. జనవరి 2021 వరకు దీనిని పొడిగించారు.

ఆపిల్ అద‌ర‌గొట్టే స్టేట్‌మెంట్‌…

యాపిల్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) టిమ్‌ కుక్‌ యాపిల్ ఉద్యోగులతో ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ప్రకటన చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలా వద్దా..? అనే అంశంపై తమ ఉద్యోగులతో చర్చించారు. తమ ఉద్యోగులు వచ్చే జూన్‌ వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. కరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో సంస్థ సాధించిన ఫలితాల్ని బట్టి ఆ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించే విషయం ఆధారపడి ఉందని పేర్కొన్నారు. అయితే, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడంలో ఉన్నసానుకూలతలను కుక్‌ గుర్తుచేశారు. అయినప్పటికీ.. ఆఫీస్ కు రాకపోయినా మంచి ఫలితాల కోసం పనిచేయడం నేర్చుకోగలిగామన్నారు. ఈ సంక్షోభ కాలంలో వచ్చిన మంచి మార్పులను కొనసాగించేందుకు కృషి చేస్తామన్నారు. తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటామని యాపిల్ సీ ఈ ఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N