సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు .. ఒక్కడు సినిమా తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకని “పోకిరి” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అంత మాత్రమే గాక “పోకిరి” సినిమాతో ప్రిన్స్ మహేష్ అనే టైటిల్ ని సూపర్ స్టార్ మహేష్ గా మార్చుకున్నాడు.
ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు కూడా అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ తో రెడీ అయిన మహేష్.. ఎవ్వరు ఊహించని విధంగా ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా సూపర్ హిట్టు మీద సూపర్ హిట్లు కొడుతూ ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం.. ఇండస్ట్రీలో ఏహీరో తీసుకొని రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు రూ.70 కోట్ల వరకు పారితోషకం తీసుకొని ఆపై సినిమా లో 20 శాతం లాభాల వాటా కూడా తీసుకోనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!