న్యూస్ సినిమా

మోనాల్ అఖిల్ కి ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ ఏమిటో తెలుసా??

మోనాల్ అఖిల్ కి ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ ఏమిటో తెలుసా??
Share

స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత గొప్ప విజయాన్ని సొంతచేసుకుందో మనం చూసాం. నిర్విఘ్నంగా ఈ షో ఇప్పటికే నాలుగు సీసన్ లను పూర్తిచేసుకుంది. అయితే, ప్ర‌తి సీజ‌న్‌లో లాగానే నాలుగవ సీజన్ లో కూడా హౌస్ లో కొన్ని రొమాంటిక్ ట్రాక్‌లు ఉన్నాయి. అందులో అఖిల్-మోనాల్ జోడీ బాగా పాపులర్ అయ్యింది.

మోనాల్ అఖిల్ కి ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ ఏమిటో తెలుసా??

అఖిల్-మోనాల్‌ల రిలేష‌న్ మాత్రం మోనాల్ ఎలిమినేట్ అయ్యేవరకు కంటిన్యూ అయ్యింది. ఇక హౌజ్‌లో వీరిద్దరి రొమాన్స్ మరియు వీరి రేలషన్ ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుందని చెప్పొచ్చు. ఇక ప్రేక్షకులలో వీరిద్దరికి ఉన్న పాపులారిటీ కోసం చాలా సార్లు బిగ్‌బాస్  మోనాల్‌ని ఎలిమినేట్ చెయ్యకుండా ఆమెను సేవ్ చేస్తూ చివరి  వరకు వ‌చ్చాడ‌న్న‌ కామెంట్లు కూడా అప్పట్లో బాగా ఊపందుకున్నాయి.

ఇదంతా ఒకఎత్తు అయితే మోనాల్ మరియు అఖిల్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా కంటిన్యూ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక ఈ జంట ట్రాక్ ను మ‌రింత క్యాష్ చేసుకునేందుకు మ‌రోవైపు  ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానల్ లు కూడా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ మా ఛానల్ మోనాల్ మరియు అఖిల్ కి సంబంధించి ఇటీవ‌ల ఓ ప్రోగ్రాం ప్రోమోను కూడా విడుద‌ల చేసింది.

యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తోన్న ‘స్టార్ట్ మ్యూజిక్’ ప్రోగ్రాం మూడో సీజ‌న్ త్వ‌ర‌లో స్టార్ మాలో ప్ర‌సారం కానున్న నేపథ్యంలో ఇందులో, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లు పాల్గొని కనువిందు చెయ్యబోతున్నారట. తాజాగా ఈ ప్రోగ్రాం లో అఖిల్ పాల్గొన్న ప్రోమోను స్టార్ మా సిబ్బంది విడుద‌ల చేసింది. ఆ ప్రోమోలో మోనాల్ వాయిస్ తో “అఖిలూ.. న‌న్ను మిస్ అవుతున్నావా? క‌ళ్లు మూసుకో” అంటూ వినిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మోనాల్ అఖిల్‌కి ఏదో స‌ర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే వెయిట్ చెయ్యాలిసిందే!!

 


Share

Related posts

బంగారం ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..? ఇదీ సీక్రెట్..!

Muraliak

ర‌జినీ మాస్ యాంగిల్‌తో `ద‌ర్బార్‌`

Siva Prasad

బిగ్ బాస్ 4 తెలుగు : బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదటిసారి .. కరోనానా మజాకా … !!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar