దేశమంతటా బయోపిక్‌ల జోరు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘83’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఎలా గెలిచింది అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. కబీర్‌సింగ్ దర్శకుడు. ఫస్ట్ లుక్‌లో క్రికెటర్స్ అంతా మైదానంలో కూర్చుని పోజివ్వడం ఆకట్టుకుంటోంది. కపిల్‌దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. మరో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాత్రలో బాలీవుడ్ నటుడు తహీర్ రాజ్ భాసిన్, అప్పటి టీమిండియా మేనేజర్ మాన్ సింగ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, క్రికెటర్లు సందీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్, శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా, సయ్యద్ కిర్మాణి పాత్రలో సాహిల్ ఖట్టర్, బల్వీందర్ సింగ్ పాత్రలో అమ్మీ విర్క్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 సంవత్సంలో ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
previous post
next post