Alia Bhatt: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. ఇక ఇదే సమయంలో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారా..? రారా..? అన్న పరిస్థితి.. సందిగ్ధంలో బాలీవుడ్ నిర్మాతలు నటీనటులు…. ప్రముఖులు ఉన్నారు. కానీ సౌత్ కి వచ్చేసరికి… కరోనా లేదు ఏమీ లేదు… అన్న తరహాలో థియేటర్లు ఓపెన్ చేస్తే చాలు ఎటువంటి భయం లేకుండానే ప్రేక్షకులు రావడం జరిగింది. అఖండ, పుష్ప వంటి సినిమాలు కరోనా కాలంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలతో దక్షిణాది సినిమా రంగ ప్రముఖులు… సినిమా బిజినెస్ పై ఉన్న అనుమానాలు అభద్రతాభావం తొలగించుకున్నారు.
కానీ నార్త్ లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో పాటు… చాలా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లపై ఆంక్షలు విధించాయి. దీంతో ఉత్తరాది సినీ ప్రేమికులకు కరోనా భయం బీకరంగ ఏర్పడింది. పరిణామాలు ఎలా ఉంటే ఇంకా సినిమా థియేటర్లకు జనాలు వస్తారా లేదా అన్న సందేహంలో సందిగ్దంలో… బాలీవుడ్ వెళ్ళిపోయింది. పరిస్థితి ఇలా ఉన్న సమయంలో హీరోయిన్ ఆలియాభట్ కీలక పాత్ర పోషించిన లేడీ ఓరియంటెడ్ మూవీ గంగుబాయి విడుదలయ్యే ఇప్పుడు విజయం సాధించటంతో బాలీవుడ్ లో ఆశలు చిగురించాయి.
ఏకంగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన క్రమంలో.. మిగతా పెద్ద సినిమాలు విడుదల చేయడానికి.. రెడీ అవుతున్నారు. వేశ్యల పిల్లలను చదివించే… గ్యాంగ్ స్టార్ గా అలియా భట్ గంగుబాయి.. పాత్రలో ఇరగ దీయడం … తో సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమా విజయం సాధించి చాలా కాలం అయింది. ఇటువంటి తరుణంలో కరోనా లాంటి కష్ట కాలం తర్వాత ఫస్ట్ విజయం లేడీ ఓరియెంటెడ్ సినిమాకి దక్కడంతో… థియేటర్లకి ప్రేక్షకులకు వచ్చే పరిస్థితి ఉండటంతో… బాలీవుడ్ సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకున్నారు. సినిమా వ్యాపారానికి బాలీవుడ్ లో ఎటువంటి డోకలేదని… ఈ సినిమాతో నిర్ధారించుకున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!