Allu arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటన ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు.గత ఏడాది అలా వైకుంఠపురం సినిమా ద్వారా ఒక విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో నటిస్తున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ఆగస్టు 13న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న సంగతి మనకు తెలిసిందే.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి ఉన్న ఫ్యాన్స్ ను బేస్ చేసుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకే అల్లు అర్జున్ సికిందర్, ఆవారా వంటి సినిమాలను దర్శకత్వం వహించిన దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం చెన్నైలో ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది.ప్రస్తుతం మరోసారి అల్లు అర్జున్ ఎంట్రీ పై వార్తలు వినబడుతున్నాయి.
ఆ దర్శకుడు సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అర్జున్..
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలివుడ్ ఎంట్రీ విలక్షణ సినిమాల దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని,వీరి కాంబినేషన్ లో యాక్షన్ డ్రామా లేదా రొమాంటిక్ సినిమా రాబోతోందని వార్తలు వినబడుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లుఅర్జున్ కోలివుడ్ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. అయితే ఈ సినిమా ద్వారా ఆయన అల్లు అర్జున్ కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడతాడా? లేదా? అనే విషయం గురించి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న” పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!