తమిళ టెలివిజన్ నటి వి.జె.చిత్ర చెన్నైలోని ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. పలు టీవీ సిరీయల్స్‌తో పాటు విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాపులర్ షో పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రలో నటిచింది వి.జె. నటిగానే కాకుండా టీవీ ప్రెజెంటర్, డ్యాన్సర్, మోడల్ గా కూడా చేసింది. ఆమె ఆత్మహత్య గల కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. చిత్ర మే 2, 1992 న చెన్నైలో జన్మించింది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై షోకు యాంకర్‌గా తన కెరిర్‌ను మెుదలుపెట్టాడు. పలు సినిమాల్లో కూడా నటించింది. సన్ టీవీ.. లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. వివిధ డాన్స్ షోలో కూడా చిత్ర పాల్గోంది.
ఇటివలే ఆమెకు హేమంత్ రవి అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వివాహం చేసుకోనున్న చిత్ర ఇలా హఠాన్మరణం చిత్ర సీమను షాక్‌కు గురిచేసింది. ఓ షూటింగ్ కోసం తన కాబోయే భర్తతో ఒక హోటల్ గదిలో స్టే చేసింది. షూటింగ్ ముగించుకొని తెల్లవారుజామున 2:30 గంటలకు హోటల్ గది చేరుకున్న చిత్ర.. స్నానానికి బాత్ రూమ్‌లోకి వెళ్లి ఎంత సేపటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హేమంత్ హోటల్ నిర్వహుకులకు సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపు తెరిచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే తెలియజేయడంతో ప్రస్తుతం ఆత్మహత్యకు కారణాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు.
చిత్ర మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతీ వ్యక్తం చేసింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న పలువురు నటులు షాక్ గురయ్యారు. చిత్ర మృతికి చిత్ర పరిశ్రమలోని కొందరి వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందనే అనుమానలు వ్యక్తమవుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!