Arjun Ambati: బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవా కి చెందిన వారే సోహిల్, అపజిత్, సన్నీ కూడా. ఇక తాజాగా వీరి బాటలోనే మరో హౌస్ మేట్ కూడా నడుస్తున్నాడు. ఆ హౌస్ మేట్ మరెవరో కాదు అర్జున్ అంబటి. ఇటీవలే ఎండ్ అయినా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్న అర్జున్ మంచి గుర్తింపును పొందాడు.
ఈయన ఆట తీరు కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు కూడా. ఇక ప్రస్తుతం శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అర్జున్ అంబటి హీరోగా 31 వెడ్స్ 21 సిరీస్ నటుడు చైతన్య రావు ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీలో కొరమీను ఫేమ్ కిశోరి ధాత్రిక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ మూవీకి ” తెప్ప సముద్రం ” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు.
అదేవిధంగా ఈ మూవీకి సతీష్ రాపోలు దర్శకత్వం మరియు కథా, స్క్రీన్ ప్లే వహించారు. నీరుకంటి మంజుల రాఘవేందర్ గౌడ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ నిన్న అనగా మహాశివరాత్రి నాడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక వీరు విడుదల చేసిన ఈ టీజర్ తో ఈ మూవీ పై హైప్స్ భారీగా పెరిగిపోయాయి.
ఇక టీజర్ కే ఈ విధమైన రెస్పాన్స్ రావడంతో సినిమా పక్కా సూపర్ హిట్ అంటున్నారు విశ్లేషకులు. 2015లో తెలంగాణలోని హాజీపూర్ లో సంచలనం సృష్టించిన బావిలో స్కూల్ పిల్లల హత్యలు సంఘటన గుర్తుకు తెచ్చేలా ఉంది ఈ టీజర్. ఇక ఈ మూవీ పై మరింత క్లారిటీ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అవ్వాల్సిందే. ఇక ప్రస్తుతానికి టీజర్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు..!
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!