మాజీ ప్రధానిగా మన దేశానికి ఎనలేని సేవ చేసిన అటల్ బీహారి వాజ్పేయి జీవితం సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది ఆగస్ట్ 16న ఆయన మరణించారు. ఉల్లేక్ అనే రచయిత ఆయన జీవితాన్ని `అన్టోల్డ్ వాజ్పేయి` అనే పుస్తకంగా రాశారు. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగానే వాజ్పేయి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తారట. అమాష్ ఫిలింస్ సంస్థ ఈ పుస్తకం హక్కులను సొంతం చేసుకుంది. వాజ్పేయి బాల్యం నుండి రాజకీయాల్లోకి వెళ్లడం బీజేపీ నేతగా, ప్రధాని మంత్రిగా ఆయన సాధించిన విజయాలను సినిమాలో చూపిస్తామని నిర్మాతలు శివ శర్మ, జీషాన్ ప్రకటించారు. స్క్రిప్ట్ రెడీ కాగానే నటీనటుల వివరాలు ప్రకటిస్తారట.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!