Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో బాలయ్య బాబు సినిమాలు చేసే తీరు చాలా ఇబ్బంది అని అందరూ అంటారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసుకోకుండా వరుసపెట్టి సినిమాలు చేయటం బాలయ్య తీరు. జయాపజయాలు కూడా పట్టించుకోకుండా బాలయ్య బాబు… ప్రాజెక్టులు ఒప్పుకుంటూ ఉంటారు. ఇటీవల అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. బాలయ్య బాబు కెరీర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. “అఖండ” రాకముందు వరకూ పరాజయాల లో ఉన్న బాలయ్య బాబు ఈ సినిమా ఇచ్చిన విజయంతో ప్రస్తుతం… వరుస పెట్టి భారీ ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. ప్రజెంట్ ఫీల్డ్ లో అనిల్ రావిపూడి సినిమా చేస్తుండగానే మరోపక్క… ఇండియన్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్టు ఓకే చేసినట్లు ఇటీవల వార్తలు రావడం మనం విన్నాం. ఇక ఇదే సమయంలో ఇండస్ట్రీలో మరో తిరుగులేని డైరెక్టర్ ప్రాజెక్టు కూడా బాలయ్య బాబు ఓకే చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే ఇప్పటివరకు పరాజయం లేని దర్శకుడిగా రాజమౌళి గ్రాఫ్ మెయింటెన్ చేయగా ఆ తర్వాత కొరటాల శివ ఇదే పంథాలో ఒక్క ఫ్లాప్ లేని డైరెక్టర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కొరటాల శివ బాలయ్య బాబు కి మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో కథ వినిపించినట్లు ఫస్ట్ సిట్టింగ్ లోనే బాలయ్య ఓకే చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా ఫినిషింగ్ లో ఉన్నారు. ఏప్రిల్ మాసంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఇదే తరుణంలో మరో పక్క ఎన్టీఆర్ కెరియర్లో 30 ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబుతో కొరటాల సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలిం నగర్ టాక్.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!