Chiranjeevi – Raviteja: గతంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో నటించాడు మాస్ మహారాజ రవితేజ. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన ఆచార్య రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాం చరణ్ మరో హీరోగా నటించాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. ఏప్రిల్ 29న ఆచార్య రిలీజ్ కానుంది. ఇక మలయాళ హిట్ సినిమా లూసీఫర్ రీమేక్‌గా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు చిరు. ఇందులో నయనతార కీలక, సత్యదేవ్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పుడు ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేశ్ సినిమాలో చిరుకు సోదరిగా నటిస్తుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదే క్రమంలో బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ తన 154వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నారు. మళ్ళీ ఇంతకాలానికి చిరుతో కలిసి రవితేజ మెగా 154 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరు, రవితేజ కలిసి కెమెరా ముందుకు రాబోతున్నారు.
Chiranjeevi – Raviteja: ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే
ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో రవితేజ జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్‌డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ వరుసగా షూటింగ్ జరుగుతున్నాయి. దాంతో ఏప్రిల్ నెలలో బల్క్ డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే దర్శకుడు బాబీ, మెగాస్టార్ డేట్స్ – రవితేజ డేట్స్ ఆ నెలలో షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఇక ఇద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే జనాలను – అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరే లెవల్. దానికోసమే అటు మెగా అభిమానులు, ఇటు మాస్ రాజా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!