Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఎంతటి ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసిందే. వందకి పైగా సినిమాలలో నటించిన చిరు.. భారీ ఎత్తునే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సత్తా చాటుకున్నాడు. అంతేకాకుండా తన తమ్ముళ్ళని కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చి సెటిల్ చేశాడు.
ఇక ప్రస్తుతం వారి పిల్లలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఇక గతంలో చిరంజీవి ఓ అవార్డ్ ఫంక్షన్ లో బ్రహ్మానందం హైట్ పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎంతో సన్నిహితంగా ఉండే చిరు మరియు బ్రహ్మానందం వాటిని చాలా ఫన్నీగా తీసుకున్నప్పటికీ బ్రహ్మానందం ఫ్యాన్స్ మాత్రం వాటిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకానొక సమయంలో బ్రహ్మానందానికి అవార్డు ఇస్తూ చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి మాట్లాడుతూ..” ఏవండీ.. పద్మశ్రీ వచ్చింది.
డాట్ రేట్ వచ్చింది.. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో ఎక్కాడు. ఎంత ఎత్తుగా అవార్డులు చూసాను కానీ.. తన ఎత్తు మాత్రం మారదు. ఇంతే ఉంటాడు. స్టేజ్ పైకి రావయ్య బ్రహ్మానందం ” అంటూ బ్రహ్మానందం హైట్ పై వ్యాఖ్యలు చేశాడు చిరు.
View this post on Instagram
ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు బ్రహ్మానందం ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!