సోషల్ మీడియాలో ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. హీరో హీరోయిన్ ఎవరూ లేని ఈ పోస్టర్ లో ఒక అమ్మాయి ముగ్గురు వేళ్ళను పట్టుకొని ఉంటుంది. దాని కింద పెద్ద అక్షరాలతో రెడ్ కలర్ లో ‘డిఐఎస్’ అని టైటిల్ రాసుంటే దాని పైన ఇంగ్లీష్ అక్షరాలతో ‘ఇన్ క్రెడిబుల్ రివేంజ్ ఇన్ దిస్ ‘ అని, కింద దొరకునా ఎటువంటి సేవ అని క్యాప్షన్ ఉంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ‘ఐ’ లో ఒక అమ్మాయి పోజ్ ఇస్తునట్టు ఉంది ఈ పోస్టర్.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించటంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే దేవి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రామచంద్ర రాగిపిండి దర్శకత్వం వహిస్తున్నారు. దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న చిత్రం పేరు దొరకునా ఇటువంటి సేవ. తాజాగా ఈ చిత్ర వివరాలను దర్శకనిర్మాతలు తెలిపారు.
చిత్రీకరణ పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయని చిత్ర నిర్మాత దేవి మహేశ్వరం తెలిపారు. టీజర్ విడుదల అయ్యేవరకూ నటీనటులు ఎవరనేది తెలమని.. టీజర్ కోసం వెయిట్ చేయాలని అయన అన్నారు. జనవరిలో సినిమాను విడుదల చేస్తామని దేవి తెలిపారు.
ఇటీవల ఓ యాప్ చేసిన సర్వేలో ప్రతి పది మందికి వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపిస్తారని.. ముఖ్యంగా మహిళలు ఈ సంబంధాలను కలిగి ఉంటున్నారని తెలిసి షాక్ అయ్యను. నేరాలు ఎక్కువగా అక్రమ సంబంధాల కారణంగా జరుగుతుండటంతో ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాను. అందుకే వివాహేతర సంబంధాల నేపథ్యంతో సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఇలాంటి ఒక కథను ఎంచుకుని సినిమాగా తెరకెక్కిస్తున్నామని దర్శకుడు రామచంద్ర తెలిపారు.
చిత్రంలోని నటీనటులు తెలియాలంటే టీజర్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!