బాలీవుడ్ కమెడియన్ బాల్రాజ్ సియాల్ బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాల్రాజ్ సీయాల్ ఇంస్టాగ్రామ్ లో తెలియజేశాడు. వాస్తవానికి ఆగస్టు 7వ తారీకు లాక్ డౌన్ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ చాలా గోప్యంగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో బాల్రాజ్ సీయాల్ – దీప్తి తులీని వివాహం జరిగింది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియాలో తెలియజేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
దీంతో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు నెటిజన్లు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. రియాల్టీ షో “ఖత్రోమ్ కి కిలాడీ 10 ఫేమ్” లో మంచి పాపులారిటీ బాల్రాజ్ సంపాదించారు. ఎంతో పాపులారిటీ ఉండటంతో కమెడియన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ దీప్తి నీ పెళ్లి చేసుకోవడంతో ఈ జంట పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి గురించి గతంలోనే అనేక వార్తలు ఇండస్ట్రీలో వచ్చాయి.
2019వ సంవత్సరంలో చండీగర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దీప్తిని మొదటి సారి చూసి కమెడియన్ బాల్రాజ్ ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత అదే విషయాన్ని దీప్తికి బాల్రాజ్ అనేకమార్లు చెప్పటం జరిగిందట. కానీ ఆమె నుండి ఎటువంటి స్పందన రాలేదట. కానీ ఈ ఏడాది ప్రారంభంలో టర్కీ, గ్రీసు పర్యటనలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందట. ఆ తర్వాత చివరాకరికి దీప్తిని పెళ్లికి ఒప్పించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాల్రాజ్ చెప్పుకొచ్చారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!