Major: అడవి శేష్ హీరోగా తలకెక్కిన “మేజర్” సినిమా శుక్రవారం జూన్ మూడో తారీకు ఉదయం. ముంబై 26/11 ఘటనకు సంబంధించి ఒక జవాన్ స్టోరీని ఆదర్శంగా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మహేష్ బాబు నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి… విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవటం జరిగింది. సినిమా చూసిన అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు. థియేటర్ లో కొంత మంది జనాలు ఏడ్చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో తాజాగా.. “మేజర్” సినిమాను చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా యూనిట్ తో పాటు హీరో అడివి శేష్ నటనని పొగడ్తలతో ముంచెత్తాడు. మొదటి ఐదు నిమిషాలు మినహా తర్వాత మొత్తం కూడా సినిమా చూసినట్లు లేదు స్టోరీలోకి ప్రేక్షకులను తీసుకుపోయే రీతిలో డైరెక్టర్ పనితనం ఉందని హరీష్ పొగిడారు. అప్పుడప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మినహా మిగతాదంతా సందీప్ జవాన్ ని చూస్తున్నట్టు గానే.. మేజర్ ఉందని మెచ్చుకున్నారు. ఈ శతాబ్దంలో ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తోందని … సినిమా యూనిట్ మొత్తాన్ని హరీష్ శంకర్ అభినందించారు.
“మేజర్” సినిమా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది కాదు, గౌరవానికి.. జాతీయగీతానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అన్న దాని గురించి బాగా చూపించినట్లు హరీష్ శంకర్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. ఇదే సమయంలో హీరో డీజే టైటిల్ కూడా క్లైమాక్స్.. చూస్తున్నంత సేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అని తెలిపారు. దేశాన్ని కాపాడే జవాన్ ల కుటుంబంపై ఈ సినిమా చూశాక మరింత గౌరవం ప్రతిఒక్కరికి పెరుగుతుంది అని..అన్నారు. ఆ కోణాన్ని సరికొత్తగా మేజర్ లో చూపించారని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సినిమాలో అడవి శేష్ నటనపై చాలామంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మేజర్ మొదటి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవటం మాత్రమే కాదు.. దేశాన్ని కాపాడే జవాన్ కర్తవ్యం పై వాళ్ళ కుటుంబం పై గౌరవం తెచ్చిన సినిమాగా నిలిచింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!