`RX100`తో సెన్సేషనల్ హిట్ సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సక్సెస్ వచ్చి ఏడాది దాటినా మరో సినిమాను అజయ్ భూపతి స్టార్ట్ చేయలేకపోయాడు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అజయ్ భూపతి మన హీరోల దగ్గరకు వెళుతున్నాడు. వారు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. చివరకు సినిమా ట్రాక్ ఎక్కకపోవడం జరుగుతూ వచ్చింది. చివరకు అజయ్ భూపతి డైరెక్షన్లో రవితేజ, సిద్ధార్థ్ కలిసి సినిమా చేస్తారని వార్తలు వినిపించాయి. దీనికి `మహాసముద్రం` అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రముఖంగా వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో ఏమో కానీ.. అజయ్‌భూపతి తన `చీప్‌స్టార్` అంటూ ఓ హీరోను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. రవితేజను ఉద్దేశించే అజయ్ భూపతి ఈ ట్వీట్ చేశాడనే వార్తలు వినపడుతున్నాయి. చాలా రోజుల పాటు వెయిట్ చేయించి.. ఇప్పుడు వద్దని అన్నందుకు అజయ్‌భూపతికి కోపం వచ్చే అలా చేశాడని టాక్.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!