The Kashmir Files: ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తున్న సినిమా ‘ద కశ్మీర్ ఫైల్స్’. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, అరాచకాలను డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు. అయితే ఈ సినిమా వెనుక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని, 700 మందికి పైగా పండిట్లను కలిసి జరిగిన విషయాలను తెలుసుకుని ఈ సినిమా రూపొందించామని చెప్పారు. దీనికోసం దాదాపు నాలుగేళ్ల పాటు రీసెర్చ్ చేశానని తెలిపారు. ఈ క్రమంలో GKPD (గ్లోబల్ కశ్మీరీ పండిట్ డయాస్పోరా) సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కశ్మీరీ పండిట్లను కలిశానన్నారు.
Kangana Ranaut: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపైన కంగనా అభ్రిప్రాయం… బాలీవుడ్ చేసిన పాపాలు కడిగేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు!
The Kashmir Files: ఈ విషయాలు ఎవరికీ తెలియవు?
ఆనాడు కశ్మీరీ పండిట్ల విషయంలో జరిగిన ఊచకోతలకు సంబంధించి చాలా విషయాలు ఎవరికీ తెలియవని, సినిమాలో చూపించింది కూడా కొంతేనని అన్నారు. గుండెల్ని పిండేసే ఘటనలు ఇంకా జరిగాయన్నారు. ఆ వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. ‘ఇవన్నీ నిజాలు. మనసును కలచివేసే సత్యాలు. మనుషుల నిజమైన కథలు’ అని ఆయన ఈ ఓ మీడియా వేదికగా చెప్పారు.
Vijay Deverakonda: టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విజయ్ దేవరకొండ డైరెక్టర్ ల లైన్ ఆప్..??
ఇంకా ఇలా అన్నారు!
సినిమా విషయంలో కశ్మీరీ పండిట్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఎవరికీ తెలియని నిజమైన సంఘటనల ఆధారంగా కశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించామన్నారు. ఆనాడు నిజంగా హిందువులకు ఇంత ఘోర అవమానాలు జరిగాయంటే నమ్మలేకున్నామని, ఆ సన్నివేశాలు చూస్తున్నంత సేపు చాలా బాధ కలిగిందని కశ్మీర్ ఫైల్స్ చుసిన పండిట్స్ అన్నారని చెప్పుకొచ్చారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!