RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే రేంజ్ లో విజయం సాధించాలని రాజమౌళి “RRR” తెరకెక్కించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నాటి నుండి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సమయంలోనే 2020 జూన్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ సమయానికి మహమ్మారి కరోనా వైరస్ రావడంతో పాటు సినిమా స్టార్ట్ చేసిన సమయంలోనే తారక్, చరణ్ ఇద్దరు గాయాలు కావడంతో చాలా నెలలు షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో గత ఏడాది అక్టోబర్ మాసంలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.
కాని కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి జనవరి 7 న రిలీజ్ చేయాలని అధికారికంగా తేదీ కూడా ప్రకటించి సినిమా ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయగా.. ఒమిక్రన్ దెబ్బకి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు థియేటర్లు మూత పడటంతో.. ఆటు ఆంక్షలు కొన్నిచోట్ల విధించడంతో ఇప్పుడు మార్చి 25 వ తారీకు రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే “RRR” షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నెక్స్ట్ మహేష్ బాబు తో చేస్తున్నట్లు పాన్ ఇండియా నేపథ్యంలో.. తీస్తున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ చేస్తూ మరోపక్క త్రివిక్రమ్ సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
ఇటువంటి తరుణంలో రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా వాయిదా వేసుకున్నట్లు నెక్స్ట్ బాలయ్య బాబుతో సినిమా చేయటానికి రెడీ అయినట్లు టాక్. “ఆన్ స్తాపబుల్” టాకీ షోలో ఓపెన్ గా నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్ అని… రాజమౌళి బాలయ్య బాబు ప్రశ్నించడం జరిగింది. దీంతో రాజమౌళి బాలయ్య బాబు తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు.. పైగా సంవత్సరాల తరబడి తాను సినిమా చేస్తారు అన్న అపవాది తనపై ఉండటంతో బాలయ్య బాబు సినిమా.. ఐదు నెలలో కంప్లీట్ చేసే రీతిలో సరికొత్త ప్లానింగ్ తో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు టాక్.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!