Eesha Rebba: అందం, అభినయం అంతకు మించి టాలెంట్ ఉన్నా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయిన భామల్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బ ఒకరు. `అంతకు ముందు.. ఆ తరువాత..` సినిమాతో హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించిన ఈషా రెబ్బ.. `అమి తుమి` మూవీతో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఆ తర్వాత అడపా తడపా సినిమాలు చేసింది. కానీ, సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈషా అందల ఆరబోతకు తెర లేపింది. అయినప్పటికీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగమ్మాయి అన్న ట్యాగ్‌లైన్ ఉండటం వల్ల స్టార్ హీరోలు సైతం ఈషా వైపు చూడలేదు.
దీంతో ప్రస్తుతం ఈషా కోలీవుడ్‌కు మఖాం మారుస్తుంది. అక్కడ నుంచి అవకాశాలు వస్తుండటంతో.. తమిళంలో స్టార్ అయ్యేందుకు కృషి చేస్తోంది. ఇకపోతే హీరోయిన్లు మేకప్ లేకుండా పెద్దగా కనిపించారు.మేకప్ లేకుండా వారు బయటకి వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి.
అలాంటిది ఈషా రెబ్బ మేకప్ లెస్ లుక్స్‌ను తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. అయితే ముఖానికి ఎటువంటి ముసుగులు వేసుకోకపోయినా ఈషా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు ఆమె సహజ అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!