‘‘‘అవతార్’ సినిమాకు ఆ టైటిల్ నేనే పెట్టా. జేమ్స్ కేమరూన ఆ సినిమా కథను నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను కనీసం ఆ సినిమా చేయడానికి ఏడేళ్లు పడుతుందని అన్నా. అందుకు ఆయనకు కోపం వచ్చింది. అలా ఎలా చెబుతున్నారని అడిగాడు. నా అనుభవంతో చెబుతున్నానని అన్నా’’ అని అన్నారు గోవిందా. బాలీవుడ్లో గోవిందా గురించి తెలియని వారుండదు. విడుదలై మంచి సక్సెస్ సాధించిన అవతార్ గురించీ తెలియని వారుండరు. ఆ సినిమా విడుదలై ఇన్నాళ్లయిన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు గోవిందా ఆ సినిమా గురించి నోరువిప్పారు. అందులో తాను నటించాల్సి ఉందని, కానీ రంగులు పడకపోవడంతో తాను నటించలేదనీ చెప్పారు. ఆ విషయాన్ని గురించి గోవిందా మాట్లాడుతూ ‘‘అందులో నటించడానికి నన్ను 400 రోజులకు పైగా కాల్షీట్లు అడిగారు. అన్ని రోజులు ఒంటికి రంగు పూసుకుని నటించడం నా చేత కాదు. అందుకే నిర్దాక్షిణ్యంగా నో అని చెప్పేశాను. ‘అవతార్’ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుందని నాకు ముందే తెలుసు. జేమ్స్ కేమరూన ముందు నుంచీ క్లారిటీతో ఉన్నారు. ఏలియన్స గురించి, నేచర్ గురించి ప్రతిదీ రాసుకున్నారు. దానికి తగ్గట్టే ఆ సినిమా కూడా బాగా ఆడింది’’ అని ఆయన చెప్పారు.
previous post
next post