Liger: పూరి – విజయ్ కాంబినేషన్ అని ఎప్పడు ప్రకటించారో అప్పటినుండి ఈ ప్రాజెక్టు పైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక కథ చెప్పడంతో పూరి జగన్నాథ్ స్టైల్ అందరికీ తెలిసిందే. కేవలం హీరో క్యారెక్టరైజెషన్ తో ఆయన సినిమాలను హిట్ చేస్తాడు. ఆయన కథలు అంతలా డిఫరెంట్‌గా ఉంటాయి మరి. హీరోని స్ర్కీన్‌పై ప్రజంట్ చేసే తీరు కూడా అలాగే ఉంటుంది. ఇక మాటలైతే చెప్పాల్సిన పనిలేదు. కథ విషయం అలా ఉంచితే ఆయన రాసే తూటాల్లాంటి మాటలే ఆయన సినిమాల సక్సెస్ ను నిర్ధరిస్తాయి.
Liger: ప్రపంచంలో ఆ నలుగురే సూపర్ స్టార్స్.. అంటున్న విజయ్ దేవరకొండ..!!
Liger: చిత్రం విశేషాలు:
ఇక వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్’ కూడా అలాంటి ప్రత్యేకతలతోనే నిండి ఉంది. ఇక ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ పెట్టి సినిమాపై మరింత ఆసక్తి పెంచారు మన పూరి. ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కోచ్ పాత్రల్లో కనిపించినున్నారు. తాజాగా ఈ చిత్రం విషయమై ఫిలిం నగర్ లో రకరకాల వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.
Liger: హైలెట్‌గా నిలవనున్న మైక్ టైసన్..విజయ్‌కు తండ్రిగా కనిపించనున్నాడా..?
కథ ఇదేనట!
ఈ సినిమాలో మైక్ టైసన్ విజయ్ దేవరకొండకు తండ్రిగా నటిస్తున్నారట. ఫస్టాఫ్‌లో కోచ్‌గా కనిపించే టైసన్ పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రిగా కనబడతాడట. గతంలో పూరి జగన్నాథ్ అందించిన హిట్ చిత్రం ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’ చిత్రం మాదిరి ఈ సినిమా కూడా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ మైక్ విదేశీ వ్యక్తి. విజయ్ దేవరకొండ పాత్ర స్వదేశానికి సంబంధించినది. ఈ కారణంతో ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే క్యాప్షన్ ఇచ్చినట్లు ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇక స్వదేశీ కొడుకు , విదేశీ తండ్రి పాత్రలను పూరి జగన్ ఎలా తీర్చిదిద్దారో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!