తమిళ నటుడు జైతో హీరోయిన్ అంజలికి ఎఫైర్ ఉందనే వార్తలు అప్పట్లో బోలెడు షికారు చేశాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఆనోటా ఈనోటా వినడమే తప్ప.. ఇద్దరూ పెదవి విప్పింది లేదు. జర్నీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జై.. తన తాజా చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. అంజలితో తనకు స్నేహమే తప్ప.. మరెలాంటి బంధం లేదని తేల్చి చెప్పాడు. ఎఫైర్ అంటూవచ్చిన వార్తలన్నీ పుకార్లేనని కొట్టి పారేశాడు. త్వరలో తనకు పెళ్లి కాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించాడు. ఇదిలా ఉంటే … తాను మతం మార్చుకున్నానంటూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఇస్లాం స్వీకరించానని.. ఏడేళ్లుగా నమాజు కూడా చేస్తున్నానన్నాడు. దీనికి తన కుటుంబ సభ్యులు అంగీకరించారని ఈ యంగ్ హీరో చెప్పుకు వచ్చాడు. ఇస్లాం స్వీకరించాక పేరు మార్చుకున్నానని.. ఇకపై తాను అజీస్ జై అని తెలిపాడు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!