నేచురల్ స్టార్ నాని ఓ సినిమా పూర్తవుతుందో లేదో మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం నాని తన సిల్వర్ జూబ్లీ చిత్రం `వి` షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరో పక్క.. సెప్టెంబర్ 13న `నానిస్ గ్యాంగ్‌లీడర్`తో సందడి చేయబోతున్నాడు. వీటన్నింటితో పాటు కొత్త కథలను వింటున్నాడు. మీడియా వర్గాల సమాచారం మేర డైరెక్టర్ శివ నిర్వాణతో నాని సినిమా చేయబోతున్నాడట. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఆధారంగా సినిమాలు తెరకెక్కించడంలో శివ నిర్వాణకు మంచి పేరుంది. నిజానికి శివ నిర్వాణ తొలి సినిమాను నానితోనే చేశాడు. ఆ సినిమా విజయం సాధించింది. తర్వాత చైతన్య, సమంతలతో చేసిన మజిలీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శివ నిర్వాణ హ్యాట్రిక్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!