Anjali: టాలీవుడ్ ఇండస్ట్రీ ని దాదాపు హీరోయిన్ రంగంలో ఎక్కువ అవకాశాలు దక్కించుకునే ముద్దు గుమ్మలు నార్త్ ఇండియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ నిర్మాతలు మరియు దర్శకులు కూడా ఎక్కువగా ఉత్తరాది బామ్మ లకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా సందర్భాలలో తెలుగు ప్రాంతానికి చెందిన అమ్మాయిలు హీరోయిన్ విషయంలో డైరెక్టర్లు ఇండస్ట్రీ అనుసరిస్తున్న విధానంపై అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.
మరికొంతమంది అయితే ఏకంగా బట్టలు విప్పేసి ఫిలించాంబర్స్ వద్ద ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితిలో ఉన్న సమయంలో తెలుగు ప్రాంతానికి చెందిన అంజలి తనదైన శైలిలో అవకాశాలు దక్కించుకుంది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”, “లయన్” మరికొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీలో కూడా నటిస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమాలో కీలక పాత్ర పోషించింది.
Read More: Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబుతో కమలహాసన్..??
ఇదిలావుంటే ఇటీవల ఈ అమ్మడికి పెళ్లి అయిపోతున్నట్లు, ఇంకా సినిమాలకు దూరం అవుతున్నట్లు వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో యధాతధంగా వైరల్ అయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తల క్లారిటీ ఇచ్చింది అంజలి. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని, పెళ్లి ఇప్పుడప్పుడే చేసుకోవాలని అవకాశంలేదని, ముందుముందు కీలకమైన పాత్రలు చేయటానికి.. ఎదురుచూస్తున్నట్లు పెళ్లి పై ప్రస్తుతం దృష్టి లేదని హీరోయిన్ అంజలి క్లారిటీ ఇచ్చింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!