NewsOrbit
సినిమా

Chiranjeevi: సినీ కార్మికుల కోసం హాస్పిటల్ వారి పిల్లల కోసం పాఠశాల.. చిరంజీవి బిగ్ హెల్ప్..!!

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యల విషయంలో ముందుండి పరిష్కరించే దిశగా పెద్దదిక్కుగా గత కొంత కాలం నుండి చిరంజీవి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో గానీ టికెట్ ధరల విషయంలో గానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సానుకూలమైన వాతావరణంలో.. చర్చించి చిరంజీవి పరిష్కరించటం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వచ్చిన ప్రారంభంలో లాక్ డౌన్ సమయంలో షూటింగ్ లు మొత్తం బంద్ కావడంతో.. పని లేకపోవడంతో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో చిరంజీవి ముందడుగు వేసి కరోన క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా విరాళాలు సేకరించి.. నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయడం తెలిసిందే. అంతమాత్రమే కాదు తరువాత సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించటం జరిగింది. Hospital for film workers School for their children .. Chiranjeevi Big Help

అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయాలు కొద్దిగా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయి.. సినిమా టికెట్ ధర లకు సంబంధించి ఇండస్ట్రీకి మేలు కరంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఉండేలా పెద్దదిక్కుగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా కార్మికులకు స్వయంగా చిరంజీవి హాస్పిటల్ నిర్మించటానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్.. మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఇండస్ట్రీకి సంబంధించి అనేక సమస్యలకు చిరంజీవి పరిష్కారం చూపారని అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని త్వరలోనే పెద్ద ఆసుపత్రి నిర్మించాలనుకుంటున్నారని తెలియజేశారు. Hospital for film workers School for their children .. Chiranjeevi Big Help

టాలీవుడ్ ఇండస్ట్రీకి కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని.. సినిమా కార్మికులకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో చిత్రపురిలో ఆసుపత్రి అదేవిధంగా పాఠశాల నిర్మాణానికి కావలసినంత స్థలం ఉందని.. చిరంజీవి ఆసుపత్రి నిర్మిస్తే కొన్ని వేల మంది కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుందని తలసాని తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా సొంత నివాసంలేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కులం…మతం లేదని తెలిపారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్లు ఇండస్ట్రీ పరంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఏదిఏమైనా ఇండస్ట్రీకి చిరంజీవే పెద్ద దిక్కు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri