Hanuman: ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్ చేస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన డైరెక్షన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.
తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలని కుప్ప కూల్చిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.275 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టి రూ. 300 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళ్తుంది హనుమాన్.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ అరుదైన రికార్డ్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా నమోదు చేయని రికార్డుని నెలకొల్పింది. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ” ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ ” గా హనుమాన్ నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తమ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ని షేర్ చేశారు.
ఇక మరోవైపు ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ మొత్తం రాముడు మరియు హనుమంతుడు కనిపించనున్నారు. ఇక ఫస్ట్ పార్టీ ఈ విధమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటే సెకండ్ పార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హనుమాన్ లాంగ్ రన్ వసూళ్లు కూడా సాధిస్తుంది. ఇక హనుమాన్ సీక్వెల్ కూడా ఇంతకుమించి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!