Bunny -Kalyan Ram: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కార్లకు ఊహించని షాక్ ఇచ్చారు. మేటర్ లోకి వెళ్తే 700 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్స్ తొలగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయగా.. ఆ సమయంలో పట్టుబడిన కార్లకు బ్లాక్ ఫిలింస్ తొలగించి జరిమాన విధించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాహన చట్టం ప్రకారం… వాహనాలకు నల్ల అద్ధం అనేది ఉండడం నేరం కాబట్టి.. దాన్ని తొలగించి అక్కడే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
ఒక్క జూబ్లీహిల్స్ లో మాత్రమే కాదు హైదరాబాద్ పలు చౌరస్తా లలో.. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో వాహన చట్టానికి విరుద్ధంగా ట్రాఫిక్ రూల్స్ కి వ్యతిరేకంగా బ్లాక్ ఫిలిమ్స్ ఉన్న వాహనాలను తనిఖీ చేసి అక్కడికి అక్కడ అద్దాలు తొలగించి జరిమానా విధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ, నందమూరి కళ్యాణ్ రామ్ కార్లు దొరకటం మీడియాలో సంచలనంగా మారింది. హైదరాబాద్ లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఎత్తున తనిఖీలు చేపడుతూ వస్తున్నారు.
ట్రాఫిక్ విషయంలో రూల్స్ పాటించకుండా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ జామ్. అయితే అటువంటి సమస్య లేకుండా చాలా వరకు కొత్త కొత్త మార్గాలలో సిటీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ వాహన చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వారికి భారీ జరిమానాలు విధిస్తున్నారు. అంతమాత్రమే కాదు అంతకుముందే ఈ తరహాలోనే ఎన్టీఆర్ కారుకి కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!