సమ్మోహనం సక్సెస్ తర్వాత తదుపరి సినిమాకు కాస్త సమయం తీసుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఎందుకంటే మరో రెండు నెలల్లో నాని ఈ సినిమా షూటింగ్‌కి రెడీ అయిపోతున్నాడు. నాని నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తుండగా.. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు. నాని సరసన అదితిరావు హైదరి హీరోయిన్గా నటిస్తుంటే.. సుధీర్ బాబు జతగా నివేదా థామస్ నటిస్తుందట. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే నాని, సుధీర్‌బాబు, అదితిరావు, నివేదా అందరూ ఇంద్రగంటి చిత్రాల్లో ఇది వరకు పనిచేసిన వారు… కాగా ఇందులో సుధీర్ బాబుని మినహాయిస్తే మిగిలిన వారిని ఇంద్రగంటి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. అంటే తనకు అచ్చొచ్చిన నటులతోనే ఇంద్రగంటి సినిమా తెరకెక్కిస్తున్నాడన్నమాట.
previous post
next post