మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ప్రారంభం కావాల్సింది. అయితే చిరు 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి పూర్తి కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడింది. మార్చి, ఏప్రిల్‌లో ప్రారంభం చేయాలనుకున్నారు. అయితే సైరా షూటింగ్ పూర్తి కావడానికి రెండు నెలల సమయం పడుతుంది. అంటే మే నెలకు సైరా చిత్రీకరణ పూర్తయితే.. జూన్‌లో చిరు కాస్త రెస్ట్ తీసుకుని జూలైలో కొరటాల సినిమాకు సిద్ధమైపోతాడని వార్తలు వినపడుతున్నాయి. నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్స్ సాధించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన కొరటాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ ఉన్న చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. ఇప్పుడు మరి చిరుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తాడని.. కాబట్టి నయనతార, అనుష్కలతో పాటు శ్రుతి హాసన్ పేరుకూడా హీరోయిన్గా పరిశీలనలోకి వచ్చిందంటున్నారు.
previous post
next post
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!