NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఎవరి వల్ల దివ్య జ్యూస్ తాగిందో తెలుసా..!? ఆనందంలో తులసి..!

Intinti Gruhalakshmi: దివ్య అన్నం తినకుండా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందని.. నందు దివ్య దగ్గరకు వెళ్లి పలకరిస్తాడు.. నీకు ఈ నాన్న ఉన్నాడు అమ్మా అని భరోసా ఇస్తాడు.. ప్రేమ్ అన్నయ్య నేను ఇంటికి తీసుకు వస్తాను అని అంటాడు..!!

Intinti Gruhalakshmi: 12 march 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 12 march 2022 Today Episode Highlights

నందు కోపంగా తులసి దగ్గరికి వెళ్లి ఆ పిచ్చిది ఆకలితో కడుపు మాడ్చుకుంటుంది. దాని ఆరోగ్యం తన చేతులతో పాడు చేసుకుంటుంది . వెంటనే ప్రేమ్ కి ఫోన్ చేసి రమ్మను అని అంటాడు. మీరు ఫోన్ చేసి పిలువకూడదా అని అంటుంది. నేను ఎందుకు ఫోన్ చేస్తాను. నువ్వే ఫోన్ చేసి రమ్మని నందు అంటాడు. ఈసారి ప్రేమ్ ఇంటికి వస్తే మీరు గొడవ పెట్టుకోకుండా ఉంటారా అని అడుగుతుంది తులసి.. ఇంటికి వచ్చిన ప్రేమ్ నాతో గొడవ పెట్టుకోకుండా ఉండమని నువ్వు చెప్పు అని నందు అంటాడు. నేనెందుకు చెబుతాను అని తులసి అంటుంది. ప్రేమ్ విషయంలో నా నిర్ణయం ఎప్పటికీ మారదు అని తులసి కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

ప్రేమ్ బయటకు వెళ్లి తన స్నేహితులను కలుస్తాడు. ఆంటీ నీన్ను ఇంట్లో నుంచి పంపేసింది అంటే అసలు మాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఆంటీ ఈ పని చేసింది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడే ఆంటీ దగ్గరికి వెళ్లి మాట్లాడదాం పదా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఇప్పుడు అవన్నీ వద్దురా.. ఇంకా జరగాల్సింది చూద్దాం. నేను ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను అని అంటాడు. అది అంత సులువైన పని కాదు అని అంటారు. మరి ఇంట్లో ఎలా పోషిస్తున్నవు ఏంటి అని అడుగుతారు. ప్రస్తుతానికి ఏమీ లేదు ఇప్పుడే అన్నీ తీసుకురావాలి అని అంటాడు. వాళ్ళిద్దరి దగ్గర ఉన్న తొమ్మిది వేలు తీసి ప్రేమ్ కి ఇస్తారు.. ఆ డబ్బులు తీసుకెళ్లి ప్రేమ్ శృతి కి ఇస్తాడు. ఈ రోజుల్లో కూడా న్యాయం, మంచి ఉన్నాయి అనిపిస్తుంది . ఒకప్పుడు నా ఫ్రెండ్స్ కి సహాయం చేసినా నాకు ఇప్పుడు మళ్ళీ వాళ్లే సహాయం చేశారు అని చెబుతాడు.

ప్రేమ్ గురించి ఆలోచిస్తూ ఉన్న దివ్య దగ్గరికి లాస్య జ్యూస్ గ్లాస్ పట్టుకొని వస్తుంది. ఆంటీ మీరు దయచేసి నా దగ్గరకు రావద్దు. నేను ఎవరితో ఏమి మాట్లాడలేను. మాట్లాడే అంత ఓపిక కూడా నాకు లేదు అని అంటుంది. లాస్య జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి నేను నిన్ను జ్యూస్ తాగమని చెప్పడానికి రాలేదు. మీ అన్నయ్య గురించి నువ్వు ఆలోచించు కానీ.. నువ్వు ఇలా తాగకపోతే అక్కడ ప్రేమ్ కూడా బాధపడతాడని ఆలోచించు.. తులసి ఎప్పుడు ఇంతే మనుషుల గురించి ఆలోచించదు. అర్థం చేసుకోలేదు అని లేనిపోని నిందలు వేసి.. ప్రేమ్ ను తీసుకు వచ్చే బాధ్యత నాది అని చెప్పి.. దివ్య చేత జ్యూస్ తాగిస్తుండి లాస్య.. దివ్య జ్యూస్ తగిందన్న సంతోషం లో తులసి రాములమ్మను హత్తుకుంటుంది. రాములమ్మ అ లాస్య మీద ఎన్ని కుట్రలు పన్ని ఆ జ్యూస్ తాగించింది నేను అర్థం చేసుకోగలను అమ్మా అని అంటుంది . లాస్య ప్లాన్ లో దివ్య ఎలా చిత్తవుతుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri