Intinti Gruhalakshmi: ప్రేమ్ గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి ఓనర్స్.. అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమని మీ పిన్ని చెప్పింది. మీరు ఇంత దగా చేస్తారని అనుకోలేదు అని అంటారు. ఏమైంది బాబాయి అని అంటుండగా.. రాములమ్మను పిలిచి ఈరోజు మీ పుట్టినరోజు అంట కదా.. మాకు ఎందుకు చెప్పలేదు.. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమ్ బాబు అంటూ కేక్ కట్ చేస్తారు.. గిఫ్ట్ గా ఆటో నడుపుకోవడానికి తాళం కూడా ఇస్తారు. అది చూసి నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రేమ్ ని నిలదీస్తుంది. నీకు తీరిగ్గా సాయంత్రం చెబుదాము అని అనుకున్నాను.. ఇంతలోనే వీళ్ళ ద్వారా నీకు ఈ విషయం తెలిసిపోయింది.. సారీ శృతి అని అంటాడు ప్రేమ్..!
గుడి దగ్గర ప్రేమ్ చూడకుండా ఎలాగోలా తప్పించుకుని తులసి ఇంటికి వస్తుంది దేవుడా నన్ను రక్షించు అని అనుకుంటూ లోపలికి వస్తుండగా ఆంటీ మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఈరోజు పుట్టినరోజు కదా అని అనగానే ఆ విషయం గురించి అయితే నాతో మాట్లాడుతున్న అవసరమే లేదు అని లోపలికి వెళ్లి పోతుంది అసలు నేను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాను వినండి ఆంటీ అని అంటుంది అంకిత. ప్రేమ ఇంటికి పిలిపించి ఇంట్లో తన భర్త డే సెలబ్రేషన్స్ చేద్దామని అనుకుంటున్నా అనగానే.. ఈ ఆలోచన మీద ఇంకెవరికైననా అంటుంది. ఇంట్లో అందరూ ఇలాగే అనుకుంటున్నారు అని అంటుంది. నాకు మాత్రం ఇష్టం లేదు. ప్రేమ్ విషయంలో నేను మారను అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళి పోతుంది. ఇప్పుడు ఇలా ఇంటికి పిలిచి బర్త్‌డేలు అలా చేస్తే తను మారిపోతాడు. జీవితంలో ఎదగడు అని లోలోపల తులసి బాధపడుతుంది. లోపల ఇంత ప్రేమ ఉన్న ఎలా ఇంత కఠినంగా ఉండగలుగుతున్నావు అని వాళ్ళ మావయ్య అడుగుతాడు.
ఈరోజు ప్రేమ్ పుట్టినరోజు కాబట్టి ప్రేమ్ కి బర్త్‌డే విషెస్ చెప్పాలని అని దివ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. దివ్య రావడం చూసి ప్రేమ తనను దగ్గరకు తీసుకుంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పిద్ది. థాంక్యూ దివ్య అని అంటాడు. నామీద బెంగతో అన్నం తినడం మానేశావా.. తింటున్నావా అని అడుగుతాడు. తినమని ఆర్డర్ వేశావుగా తినకుండా ఎలా ఉంటాను అని అంటుంది. సరే బయట నుంచొని ఎందుకు లోపలికి వెళ్దాం పదండి అని శృతి అంటుంది.
నువ్వు ఇక్కడకు వస్తున్న విషయం అమ్మకు చెప్పావా అని అడుగుతాడు. నీ బర్త్ డే సెలబ్రేట్ చేద్దామని అమ్మని అడిగాను. ఒప్పుకోను అని చెప్పింది. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇక్కడకు వస్తున్నానని చెప్పలేదు ఇకమీదట కూడా చెప్పను అని అంటుంది దివ్య. అమ్మ ఏం చేసినా మన కోసమే మనకు మంచి జరగాలని చేస్తుంది. ఈసారీ వచ్చేటప్పుడు అమ్మకు చెప్పి రా అని అంటాడు. అంటే ఏంట్రా నన్ను ఇండైరెక్ట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెబుతున్నావా అని అంటుంది. నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకు వచ్చేది నేనే.. అది గుర్తుంచుకో అంటూ ఏడుస్తూ దివ్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దివ్య నీ బర్త్‌డే గుర్తుంచుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తె ఏడుస్తూ పంపిస్తావా అని శృతి అంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్పదు అంటూ.. ప్రేమ్ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రేమ్ కొత్త ఆటోకి శృతి పూజ చేస్తుంది. మిగతా విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!