Intinti Gruhalakshmi: తులసి సంగీత పాటశాల బోర్డ్ పెడుతుంది బయట.. వాళ్ళ నాన్న రేయ్ నందు తులసి సంగీతం నేర్పిస్తుంది. నీకు తెలిసిన వారు ఎవరైనా సంగీతం నేర్చుకుంటాను అంటే ఇక్కడికి పంపించు అంటుంది. ఊరికినే కాదు కమిషన్ ఇస్తాము అని అనసూయమ్మ అంటుంది. దాంతో నందు కోపంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు..!
అంకిత వాళ్ళ డాడీ అమెరికా నుంచి వస్తున్నాడు అని గాయత్రీ చెబుతుంది. అయితే రేపు పొద్దున్నే త్వరగా లేచి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి అని అంకిత ఉంటుంది. మీ డాడీ ఎయిర్ పోర్ట్ కి వద్దు డైరెక్ట్ గా గుడి కాడికి రమ్మని చెప్పారు మనకు ఏదో శుభవార్త చెబుతాను అని అన్నారు.. సరే అని అభి అంకిత గాయత్రీ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అంకిత వాళ్ళ డాడీ అంకిత కు ఒక డాక్యుమెంట్స్ ఇస్తూ.. ఇది ఎన్నో ఏళ్లుగా మనకు దక్కని ఆస్తి ఈరోజు మనకు దక్కుతుందని.. 50 కోట్ల ఆస్తి మన సొంతం కాబోతోంది. ఈ అస్తి నీ పేరు మీద రాస్తాను అంకిత అని వాళ్ళ నాన్న చెబుతాడు..
అంకిత ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు డాడీ అని అంటుంది. అభి అదేంటి అంకిత మీ డాడీ అంత ప్రేమగా ఇస్తాను అంటే వద్దు అంటావు అని అంటాడు. మాకు మాత్రం ఎవరు ఉన్నారు అంకిత నువ్వు తప్ప.. నువ్వు అల్లుడుగారు ఇద్దరూ బాగుంటే నాకు అదే చాలు. ఈ డబ్బులతో మీ జీవితం చాలా సంతోషంగా గడపండి. అభి నీ ఆలోచన తోడైతే మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుంది.వీటిని చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టమని గాయత్రి చెబుతుంది. ఇక్కడ జరిగింది అంతా లాస్య ఒక పక్కనుంచి గమనిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా 50 కోట్ల రూపాయల ఆస్తి అభి వారసుడు అవుతాడు అని తెలిసి లాస్య వెంటనే అభిని మంచిగా చేసుకోమని నందుకు చెబుతుంది.