NTR 31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలె `ఆర్ఆర్ఆర్`తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించి సూపర్ డూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
ఇది కంప్లీట్ అయిన వెంటనే తారక్ `కేజీఎఫ్`తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీని పట్టాలెక్కించనున్నాడు. `ఎన్టీఆర్ 31` వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్లపై హై బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మే 20న తారక్ బర్త్‌డే కావడంతో ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ బయటకు వదిలారు. దీనికి సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. లోకనాయకుడు, సీనియర్ స్టార్ కమల్ హాసన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట.
ఆయన రోల్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఆయన ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇటీవలె ప్రశాంత్ నీల్ ఆయన్ను కలిసి కథ వినిపించగా.. వెంటనే ఆయన ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!