Hero Yash: కన్నడ రాక్‌స్టార్ యశ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన `కేజీఎఫ్ చాప్టర్ 1`తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన ఈయన.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ `కేజీఎఫ్ 2`తో ప్రేక్షకులను పలకరించాడు. ఏప్రిల్ 14న కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాలో రాకీభాయ్ గా యశ్ తనదైన నటనతో విశ్వరూపం చూపించి ప్రేక్షకులను మిస్మరైజ్ చేశాడు. మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేశాడు. రాకీ భాయ్ పాత్రకు తాను తప్పితే మరొకరు సెట్ కాలేరు అన్న విధంగా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా కేజీఎఫ్ 2 చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. యశ్‌కు కొత్త ట్యాగ్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా యశ్‌ను బాలీవుడ్ బిగ్‌బి అమితా బచ్చన్‌తో పోలుస్తూ పోస్ట్ పెట్టింది. `కొన్ని దశాబ్దాలుగా యాంగ్రీ యంగ్ మ్యాన్‌ను ఇండియా మిస్సైంది. అమితాబ్ బచ్చన్ తర్వాత నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడా స్థానాన్ని యశ్ భర్తీ చేశాడు. ఇది అద్భుతం’ అంటూ కంగనా తన పోస్ట్ లో రాసుకొచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి అమితాబ్‌తో కంగనా యశ్‌ను పోల్చడంతో.. ఆయన అభినులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కాగా, ప్రస్తుతం కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద మాసివ్ కలెక్షన్స్‌ను రాబడుతూ దుమ్ము దులిపేస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో సహా పలు భారీ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం.. ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!