1983 ప్రపంచకప్పు గురించి ఎన్ని సార్లు అనుకున్నా తనివి తీరదు. భారత జట్టు ప్రపంచకప్పును గెలుచుకున్న ఏడాది అది. అందుకే ఆ ఏడాదిని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అలాగే కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా ఆడిన ఆటను కూడా మర్చిపోలేరు. అంటే మన టీమ్ ఆడిన విజువల్స్ ను మాత్రం ఎవరికి వారు ఊహించుకున్నారంతే. ఎందుకంటే అప్పట్లో బీబీసీ స్ట్రైక్ చేయడంతో విజువల్స్ ప్లే చేయలేదు. పైగా ఈ మ్యాచ్ రికార్డడ్ వీడియో కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ మ్యాచ్‌ను యాజ్ ఇట్ ఈజ్‌గా `83` చిత్ర బృందం తెరకెక్కించనుంది. అప్పటి టీమిండియాకు సారథ్యం వహించిన కపిల్ దేవ్ ఇచ్చే సూచనలతో, ఆయన చెప్పే అంశాల ఆధారంగా మ్యాచ్‌ను యథాతథంగా చిత్రీకరించనున్నారు. ఇటీవలి కాలం వరకు కర్ణాటకలోని ధర్మస్థలలో టీమ్‌కు కపిల్‌దేవ్ సారథ్యంలో శిక్షణ ఇచ్చారు. రణ్ వీర్ సింగ్ ఇందులో కపిల్ దేవ్‌గా కనిపిస్తారు. ఇందులో రణ్వీర్ భార్య పాత్రలో దీపిక కనిపించనుంది. పెళ్లి తర్వాత వీరిద్దరు భార్యాభర్తలుగానే కనిపించనున్నారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!