Ketika Sharma: కేతిక శర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన `రొమాంటిక్` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ అందం.. మొదటి చిత్రంతోనే తన అందచందాలతో యూత్‌ను ఫిదా చేసింది. ఆ తర్వాత నాగ శైర్యకు జోడీగా `లక్ష్య`లో నటించింది.
ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. కేతిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌ను అందుకుంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో తన అందాలన్నీ ఓ రేంజ్లో చూపించేస్తుంటుంది. తాజాగా ఎద అందాలను హైలైట్ చేస్తూ మత్తెక్కించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇంకేముంది వాటిని చూసి తట్టుకోలేకపోతున్న కుర్రాళ్ళు రకరకాల కామెంట్స్‌తో తెగ గోల పెట్టేస్తున్నారు. మొత్తానికి కేతిక తాజా ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్‌కు జోడీగా `రంగరంగ వైభవంగా` చిత్రంలో నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం కేతిక చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!