NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Union Bidget 2022: ఎంపీలతో జగన్ అత్యవసర సమావేశం..! రాజ్యసభలో బీజేపీకి బాంబ్ లాంటి వార్త..!?

cm jagan meeting with mps on union bidget 2022

Union Bidget 2022: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ఒరిగిందేమన్నా ఉందా అంటే.. ఏమీ లేదనే చెప్పాలి. అసలు రాష్ట్రాల ప్రాతిపదికన ఇచ్చిందే లేదని చెప్పాలి. గత బడ్జెట్ లో రాష్ట్రాలవారీగా ఏమిస్తారో చెప్పేవారు. కానీ.. ఈసారి అలా కాకుండా తాము చేయాలనుకుంటున్నవే చెప్పారు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే.. ఈ బడ్జెట్ లో ఏపీకి తీపి కబురులాంటిది మాత్రం ఒకటుంది. రాష్ట్రాల కోసం లక్ష కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంటే.. ఆ నిధి ద్వారా వడ్డీ లేని రుణం తీసుకోవచ్చు. సంక్షేమ పాలన కోసం అప్పులు చేసే ఏపీకి ఈ నిధి వరమే అనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే.. మొత్తంగా ఏపీని ప్రత్యేకంగా చూడటం కాదు కదా.. ఇవ్వాల్సినవే ఇవ్వలేదని చెప్పాలి.

cm jagan meeting with mps on union bidget 2022
cm jagan meeting with mps on union bidget 2022

ఏపీ వైపు చూడని కేంద్రం.. 

విభజిత రాష్ట్రంగా ఏపీకి గతంలో ఇచ్చిన హామీలెన్నో ఈ బడ్జెట్ లో కూడా నెరవేరలేదు. కృష్ణాగోదావరి, కృష్ణాపెన్నా నదుల అనుసంధానం విషయంలో ఒక ప్రాజెక్టు రూపొందించామని చెప్పడం ఊరటనిస్తున్నా.. కేటాయింపులు చెప్పలేదు. జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు ఎంతోకొంత నిధులు కేటాయించాల్సిందే. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పునరావాసానికే 27వేల కోట్లు అవసరం. ఆ ప్రస్తావనే లేకపోవడంతో 2022 జూన్ కల్లా పోలవరం ద్వారా నీళ్లిస్తామన్న సీఎం జగన్ హామీ నెరవేరడం కష్టమే. రైల్వే జోన్ సంగతి సరేసరి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు కూడా ఏమీ కేటాయించలేదు. విశాఖ మెట్రో ప్రస్తావనే లేదు. జల రవాణా గురించి చెప్పలేదు.

ఎంపీలు సాధిస్తారా..

మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా ఎంత కేటాయించిందీ చెప్పలేదు. సుదీర్ఘ తీర ప్రాంతమున్నా పోర్టుల ప్రస్తావనే లేదు. వెనుకబడిన జిల్లలకు కేటాయించే నిధులు లేవు. మొత్తంగా ఏపీకి ఈ బడ్జెట్ లో కూడా నిధులు లేవు. మొత్తంగా రాష్ట్రానికి ఎప్పటిలా అన్యాయం జరిగిందనేది వాస్తవం. బడ్జెట్ పై సీఎం జగన్, ఎంపీలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సీఎం వద్ద ఈ అంశంపై చర్చించారని తెలుస్తోంది. రేపటి నుంచి బడ్జెట్ పై జరిగే చర్చలో వైసీపీ ఎంపీలు నిరసన తెలుపుతారా..? బడ్జెట్ ను స్వాగతిస్తారా..? లేదంటే.. రాజ్యసభలో వైసీపీకి బలం ఉంది. అక్కడ వైసీపీ ఎదురు తిరిగితే బీజేపీకి షాక్ తప్పదు. అలా చేేసి ఏపీకి రావాల్సిన వాటిని సాధిస్తారా..? చూద్దాం..!! 

author avatar
Muraliak

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju