రజనీకాంత్, శంకర్‌లతో 2..0 చిత్రాన్నిప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మేకింగ్ సమయంలో సబ్‌టైటిల్స్ రాయించారు. ఇది ఇప్పుడు కాస్త వివాదంగా మారింది. సబ్‌టైటిలిస్ట్ రేఖ్స్ ఇటీవల తనకు లైకా సంస్థ ఇస్తానని డబ్బులు ఇవ్వలేదంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లైకా సంస్థ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేఖ్స్తో ఈ వివాదం గురించి మాట్లాడుదామని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన తీయడం లేదని, ఆమెకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఎప్పుడో ఇచ్చామని లైకా ప్రతినిధి చెబుతూ ఓ ప్రెస్‌నోట్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. “రేఖ్స్ సబ్‌టైటిల్స్ కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారు. అయితే మార్కెట్ ధర అంత లేదు. లైకా అంత మొత్తం ఇస్తామని కాకుండా రూ.50వేలు ఇస్తామని చెప్పింది. ముందు పనిచేసిన తర్వాత డబ్బులు గురించి మాట్లాడుకుందామని ఆమె వెళ్లి తను అనుకున్న మొత్తాన్ని మనసులో ఉంచుకుని పనిని పూర్తి చేశారు. మేం ఆమెకు ఇస్తామన్న 50 వేల రూపాయలను ఇచ్చేశాం. తరుచు ఆమె అనుకున్న మొత్తం కోసం ఆమె మమ్మల్ని సంప్రదించారు. లైకా అందుకు స్పందించలేదు. మీడియా దగ్గర ఆమె తప్పుడు ఆరోపణలను చేశారు. నిజానికి మా బడ్జెట్ కాకపోయినప్పటికీ ఆమె లక్ష రూపాయలు ఇస్తామని పది రోజుల క్రితం కూడా చెప్పాం. ఎంతో డబ్బులు పోగేసి సినిమా చేస్తాం. సింపుల్ ట్వీట్‌తో ఇతరుల పేరుని దెబ్బ తీయడం చాలా సులభం. మా సంస్థలో పనిచేసిన అందరికీ విలువ ఇస్తాం. కానీ అర్హత లేని మేరకు డబ్బులు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా లేం“ అన్నారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!