బ్యాక్ బెంచ్ స్టూడెంట్, రన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి తెలుగుచిత్రాలతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న నటుడు మహత్. తమిళ హీరో శింబుకి మహత్ మంచి స్నేహితుడు. ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మాజీ మిస్ ఇండియా, తన లవర్ ప్రాచీ మిశ్రాను మహత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని మహత్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగనుందనే దానిపై మహత్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!