SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సర్కార్ వారి పాట” మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వినబడుతున్న వార్తలు అభిమానుల్లో అంచనాలు మరింత పెంచుతున్నాయి. ఇక ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు సరికొత్త మేకోవర్ తో…. గుబురు జుట్టు తో పాటు మేడపై టాటూ తో… సినిమాలో కనిపిస్తూ ఉండటంతో ఇటువంటి క్యారెక్టర్ మహేష్ చేస్తున్నాడు అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఇటువంటి తరుణంలో … “సర్కారు వారి పాట” మరో “పోకిరి” మాదిరిగా ఉంటుంది అని స్వయంగా మహేష్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఎన్టీఆర్ షో లో తెలియజేయడం మనం విన్నాం. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమా నుండి రిలీజ్ అయిన “కళావతి పాట” సోషల్ మీడియాలో రికార్డులు తిరగ రాస్తున్న సంగతి తెలిసిందే. పాటకు వచ్చిన క్రేజ్ కి రాసిన అనంత శ్రీరామ్ నీ టీవీ చానల్స్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సినిమా గురించి మాట్లాడుతూ అనుకోకుండా.. మహేష్ క్యారెక్టర్ గురించి చెప్పేశాడు.
సమాజంలో ఒక మొండోడు… ఎప్పుడు ఏదొక కొట్లాటలలో…గొడవలలో ఉండే వ్యక్తి.. అనాధగా పెరిగిన అబ్బాయికి.. ఎటువంటి అమ్మాయిలతో పరిచయం లేని వాడు … ఒక్కసారిగా ప్రేమ లో పడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ పాట రాశాను అంటూ అనంత శ్రీరామ్..చెప్పాడు. దీంతో అనుకోకుండానే ఈ సినిమాలో మహేష్ బాబు అనాధ అని ఎప్పుడూ సెటిల్మెంట్లు చేసే వ్యక్తి అని లిక్ చేసారు. అనంత శ్రీ రామ్ చేసిన కామెంట్స్ తో చాలావరకు పోకిరీ మాదిరిగానే మహేష్ క్యారెక్టర్ ఉందని మహేష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన ఫస్ట్ టైం హీరోయిన్ పాత్రలో కళావతి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తుండటంతో… సినిమా రిజల్ట్ ఏవిధంగా వుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!