అగ్ర కథానాయకుడు మహేష్, తెరపై హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలోనే కాదు.. తెర వెనుక కూడా తాను రియల్ హీరో అని నిరూపించుకున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్, యు.కె కి చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ వారితో కలిసి మహేష్ చిన్న పిల్లల ఆరోగ్యం గురించి అవగాహన పెంపొందించడానికి మూడున్నరేళ్లుగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరి భాగస్వామ్యంతో 1000 పిల్లల గుండె ఆపరేషన్స్‌ను చేయించారు. ఈ విషయాన్ని ఆయన సతీమణి నమత్రా శిరోద్కర్ తెలియజేశారు. ఈ బృహత్ కార్యక్రమంలో మహేష్‌తో చేతులు కలిపిన ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ 18 గ్రామాల్లో క్యాంపులను నిర్వహించిందని తెలిపారు నమ్రత. ఈ అవేర్ నెస్ ప్రోగ్రాంలో తమని కూడా భాగం చేసిన ఆంధ్రా హాస్పిటల్స్ పి.వి.రామారావుకి ఈ సందర్భంగా ఆమె థాంక్స్ చెప్పారు.
previous post
next post