NBK 107: నటసింహం నందమూరి బాలయ్య బాబు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “అఖండ” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు చాలా పెద్ద మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. రాయలసీమ నేపథ్యంలో మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య కి ఆల్ రెడీ శృతిహాసన్ ను హీరోయిన్ గా సెట్ చేయటం తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో లక్కీ హీరోయిన్ గా ఉన్న శృతిహాసన్ నీ మెయిన్ హీరోయిన్ గా బాలయ్య సరసన పెట్టి సినిమా చేస్తున్నారు. ఫస్ట్ టైం శృతిహాసన్ బాలయ్య పక్కన నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమాలో బాలయ్య పక్కన మరో హీరోయిన్ నీ తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం మలయాళంలో క్రేజ్ ఉన్న హనీ రోజ్ నీ తీసుకోబోతున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే దసరా పండుగకు విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే బాలయ్య బాబు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!