ఈ మధ్యనే తన 60వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్లో సెలబ్రేట్ చేసుకున్నాడు కింగ్ నాగార్జున. స్పెయిన్లో ఉన్న సమయంలో నాగార్జున కొత్త టాటూ వేయించుకున్నాడు. కానీ ఆ విషయాన్ని తను బయట పెట్టలేదు. అయితే బిగ్బాస్ హౌస్కు అతిథిగా విచ్చేసిన నాని, ఈ విషయాన్ని పసిగట్టి.. ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారని.. దానికి అర్థమేంటని అడిగాడు. దానికి నాగ్ బదులిస్తూ తన 60వ పుట్టినరోజుకు తనకు తాను గిఫ్ట్ ఇచ్చుకుంటూ టాటూ వేయించుకున్నానని చెప్పారు. దిక్చూరి, నాగుపాము కలయితో ఉన్న టాటూ గురించి నాగార్జున వివరించారు. “నాగుపాము అని చూసిన వారి అర్థమవుతుంది. దిక్చూచిలో కన్నుకొత్త విషయాలను అన్వేషించే మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇక దిక్చూచిలో ఎన్ అక్షరం నాగార్జున అనే పేరుని తెలియజేస్తుంది. పాము పక్కనున్న చుక్కలు పాము కుబుసాన్ని విడిచేసి కొత్త చర్మాన్ని పొందినట్లు పాత విషయాలను మోస్తూ వెళ్లకుండా గతం గతః అనుకుని ముందుకెళ్లే తత్వాన్ని సూచిస్తుంది“ అని ఆయన తెలిపారు.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!